మహానటి మ్యారేజ్ పై మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి ఈసారి ఓ వ్యాపార వేత్తతో కీర్తిసురేష్ ప్రేమలో ఉందని
13 ఏళ్లుగా లవ్ స్టోరీ నడుస్తోందని మరో నాలుగు ఏళ్లు ఆగిన తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని
కోలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. కీర్తిసురేష్ మ్యారేజ్ పై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి.
ఒకసారి కమెడియన్ తో లవ్ లో ఉందని మరోసారి బడా బిజినెస్ మెన్ ను పెళ్లాడనుందని
ఇంకోసారి తమిళ స్టార్ హీరో విజయ్ తో పీకల్లోతు ప్రేమలో ఉందని
ఇలా రకరకాల రూమర్స్ వినిపిస్తూ వస్తున్నాయి. ఇఫ్పుడు చిన్నప్పటి స్నేహితుడితోనే ప్రేమలో ఉందని
ప్రచారం మొదలైంది. ఏదిఏమైనా మహానటిపై మాటి మాటికి ఇలా రూమర్స్ పుట్టుకురావడం
ఆమె ఇవన్ని పట్టించుకోకుండా తనదారిలో తాను సినిమాలు చేస్తుండటంతో
అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం కీర్తి చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి.
తెలుగులో దసరా, భోళాశంకర్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.