మరోసారి ఓం రౌట్ పై విమర్శలు
ప్రశాంత్ వర్మను చూసి నేర్చుకోమంటూ పోస్టులు
ఛాన్స్ దొరికిన ప్రతీసారి ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ ను విమర్శలు గుప్పిస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్.
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ డేట్స్ అందిస్తే, టీసిరీస్ అధినేత 500 కోట్ల బడ్జెట్ ఇస్తే, ఆదిపురుష్ మూవీని వీడియో గేమ్ గా తెరకెక్కించడమే మాత్రమే కాకుండా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా సినిమాను నిర్మించాడనే విమర్శను ఎదుర్కొన్నాడు. వరుణ్ ధావన్ నటించిన భేడియా ట్రైలర్ విడుదలైనప్పుడు ఈ సినిమాలో గ్రాఫిక్ నెక్ట్స్ లెవల్లో ఉండటం చూసి ఒక సారి ఓం రౌత్ ను టార్గెట్ చేసారు నెటిజన్స్. ఇప్పుడు ప్రశాంత్ వర్మ రిలీజ్ చేసిన హనుమాన్ టీజర్ చూసి మరోసారి ఓంరౌత్ పై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ పోస్టులు కనిపిస్తున్నాయి. కంటెంట్ ఉండి చెప్పాల్సిన పాయింట్ క్లియర్ గా ఉంటే హనుమాన్ లాంటి చిత్రాలు తక్కువ బడ్జెట్ లోనే అద్భుతంగా తీయవచ్చు అని యంగ్ ఫిల్మ్ మేకర్స్ ను చూసి ఓం రౌత్ నేర్చుకోవాలని చెబుతున్నారు. జనవరి 12న రిలీజ్ కావాల్సిన ఆదిపురుష్ ఇఫ్పుడు జూన్ 16న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్. మరి అప్పటికైనా సినిమాను సరిదిద్ది ప్రేక్షకులు కోరుకుంటున్న విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడో లేదో చూడాల్సి ఉంది.