తునీవు సినిమాతో కోలీవుడ్ కు సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చాడు అజిత్. వినోద్ లాంటి అప్ కమ్మింగ్ డైరెక్టర్ తో
200 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్నాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి నయనతార భర్త విఘ్నేష్ శివన్ తో
ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని కనీ వినీ ఎరుగని రీతిలో తెరకెక్కించి అజిత్ కెరీర్ లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా స్టార్స్ ను సెలక్ట్ చేస్తున్నాడు. కొత్త చిత్రంలో అజిత్ విలన్ గా నటించనున్నాడని సమాచారం. అతనికి జోడిగా ఐశ్వర్యారాయ్ కనిపించనుందట. అదే నిజమైతే 23 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతున్నట్లే లెక్క. గతంలో వీరిద్దరు ప్రియురాలు పిలిచింది చిత్రంలో నటించారు. ఇప్పుడు ఈ జంట కలసి నటించడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్ పాత్రను పోషిస్తున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభించి ఈ ఏడాది దీపావళి పండక్కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. గతేడాది పొన్నియన్ సెల్వన్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి ఘన విజయాన్ని అందుకుంది ఐశ్వర్యారాయ్ బచ్చన్. త్వరలో పొన్నియన్ సెల్వన్ 2 లో కనిపిచనుంది.