మంచి సినిమాలకు ప్రమోషన్ తో పని లేదు. ఇదీ తన కొత్త చిత్రం తునీవు రిలీజ్ కు ముందు అజిత్ చెప్పిన మాట.
ఈ మాట చెప్పి సరిగ్గా నెల గడవలేదు. ఇఫ్పుడు అజిత్ కూడా ప్రమోషన్ బాట పట్టాడు.
తునీవు సినిమాను ఏకంగా అంతర్జాతీయంగా ప్రచారం మొదలుపెట్టాడు. ఇప్పటికే సినిమా పోస్టర్ ను దుబాయ్ లో ఆకాశంలో ఎగురవేశారు. గతంలో 2.0 కోసమే ఇలాంటి ప్రమోషన్ చేసారు. మరో విశేషం ఏంటంటే డిసెంబర్ 31న తునీవు ట్రైలర్ ను దుబాయ్ లో బుర్జ్ ఖాలిఫాలోనూ, అలాగే న్యూయార్క్ లోని టైమ్స్ స్క్పేవ్ లోనూ విడుదల చేయనున్నారట.
నిన్న మొన్నటి వరకు అసలు ప్రమోషన్ అవసరం లేదు అన్న అజిత్ ఇప్పుడు సడన్ గా రూటు ఎందుకు మార్చినట్లు అంటే అందుకు కారణం ఈ సినిమాను తమిళనాడు రైట్స్ కొనుగోలు చేసిన లైకా ప్రొడక్షన్స్.
ఒక వైపు విజయ్ వారసుడు మూవీతో వస్తున్నాడు. ప్రమోషన్ లో దూసుకుపోతున్నాడు. ఈ దశలో విజయ్ కు గట్టి పోటీ ఇవ్వాలంటే అంతకు మించి తునీవు ప్రమోషన్ ఉండాలని పట్టుబట్టి అజిత్ ను ఒప్పించి భారీ ఎత్తున ప్రమోషన్ స్టార్ట్ చేసింది లైకా ప్రొడక్షన్స్. వచ్చే సంక్రాంతి పండక్కి ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.