సీనియర్స్ లో నాగార్జున బాక్సాఫీస్ సిచ్యువేషన్ అస్సలు బాగోలేదు. ఇప్పుడు కింగ్ కు అర్జెంటుగా బ్లాక్ బస్టర్ కావాలి.
కాని కనీసం హిట్ కూడా అందుకోలేని పరిస్థితిలో పడిపోయాడు నాగార్జున. దసరాకు రిలీజైన ఘోస్ట్ కుడా దారుణంగా నిరుత్సాహపరిచింది. ఈ దశలో నాగార్జున తన 100 చిత్రం పై దృష్టి పెట్టాడని ప్రచారం సాగింది. అందుకు తగ్గట్లే ఒకటి రెండు సందర్భాల్లో నాగార్జున కూడా మోహన్ రాజా తో కలసి హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఈసారి అఖిల్ తో కలసి మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ మూవీ చేస్తానని అది తన వందో సినిమా అని గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజా కు ఇప్పటికే ఆ బాధ్యతలను అప్పగించినట్లు చెప్పాడు.
కాని గాడ్ ఫాదర్ రిలీజ్ తర్వాత ఈ కాంబినేషన్ లో మూవీపై ఒక్కసారిగా సైలెన్స్ స్టార్ట్ అయింది. అఖిల్ ఏజెంట్ లోనే ఉండిపోవడం మోహన్ రాజా కోలీవుడ్ కు వెళ్లిపోవడంతో నాగార్జున ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడు.
సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నేను లోకల్, పాగల్, ధమాకా, సినిమాలకు రైటర్ గా పని చేసిన ప్రసన్న కుమార్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున ఒక ఎంటర్ టైనింగ్ మూవీ చేయనున్నాడు.
ఈ మూవీ మలయాళ రీమేక్ అని ప్రచారం సాగగా అందులో ఎలాంటి నిజం లేదని తెలిపాడు ప్రసన్న కుమార్.
కనీసం ఈ సినిమాతోనైనా నాగార్జున కమ్ బ్యాక్ ఇవ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.