అలీ కూతురి పెళ్లికి పవన్ ఎందుకు రాలేదు?

By KTV Telugu On 3 December, 2022
image

క్లోజ్ ఫ్రెండ్ డాటర్ మ్యారేజ్ కు భీమ్లా కావాలనే డుమ్మా కొట్టాడా
అలీ చెప్పిన మెగా రీజన్ ఏంటి

టాలీవుడ్ స్టార్ కమెడియన అలీ,
ఇటీవలే తన కూతురి పెళ్లిని ఘనంగా నిర్వహించాడు.
ఈ పెళ్లి వేడుకకు అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
కాని అలీ ప్రాణ స్నేహితుడు పవన్ కళ్యాణ్ మాత్రం పెళ్లి వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు.
దాంతో అసలు అలీకి, పవన్ కు దూరం ఇంకా పెరిగిందనే వార్తలు పెరిగాయి.
పవన్ కావాలనే ఈ వెడ్డింగ్ కు రాలేదనే ప్రచారం ప్రారంభమైంది.
అలీని కూడా అందరూ ఇదే ప్రశ్న వేయడం మొదలు పెట్టారు.
దాంతో అలీ పవన్ తన కూతురి పెళ్లికి రాకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.
పెళ్లి రోజున పవన్ ఫ్లైట్ మిస్ కావడం వల్లే వేడుకకు హాజరు కాలేకపోయాడట.
అంతే కాదు త్వరలో న్యూలీ కపుల్డ్ జోడిని ప్రత్యేకంగా కలసి ఆశీర్వదించబోతున్నాడట.
పవన్ ను కాదని, పవన్ పార్టీని కాదని, వైఎస్ఆర్ సీపీలో ఆలీ చేరడంతోనే వీరద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది.

ఆ తర్వాత వీరిద్దరు కలసి కనిపించింది లేదు.
పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లానాయక్ మూవీస్ లోనూ అలీ నటించలేదు.
ప్రస్తుతం తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు లోనూ అలీ నటించడం లేదు.
మొత్తంగా బెస్ట్ ఫ్రెండ్స్ ను పొలిటికల్ ఐడియాలాజీ వేరు చేసింది.