పుష్ప పాన్ ఇండియా వైడ్ గా దుమ్మురేపడంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్.
దాంతో పుష్పకు ముందు వరకు అతని కోసం సిద్దం చేసిన కథలు అన్ని కూడా పక్కన పడేయాల్సి వచ్చింది.
అందులో వేణు శ్రీరామ్ రాసిన ఐకాన్ స్టోరీ కూడా ఉంది. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బన్ని.
ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటి అనేదానికి ఇండస్ట్రీలో సడన్ గా డిస్కషన్ స్టార్ట్ అయింది.
ముందుగా త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకున్నాడట. జులాయి, సన్ ఆఫ్ సత్య మూర్తి, అల వైకుంఠపురములో మూవీస్ తర్వాత అల్లు అర్జున్ తోనే మరో మూవీ ప్లాన్ చేసాడు త్రివిక్రమ్. అయితే పుష్ప తో ఐకాన్ కు పాన్ ఇండియా ఇమేజ్ అందిరావడంతో అందుకు తగ్గ స్క్రిప్ట్ తన దగ్గర లేదని చెప్పుకొచ్చాడట త్రివిక్రమ్.
దాంతో అల్లు అర్జున్ తన తదుపరి సినిమా కోసం పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న దర్శకుల వేటలో పడ్డాడట.
అలా చూసుకుంటే లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, అట్లి లాంటి దర్శకులు, ఇప్పుడు ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు.
ఈ దశలో బన్ని ప్లాన్ ఏంటి ఎలా ఉండబోతోంది అనేది ఆశక్తికరంగా మారింది.
పుష్పతో సుకుమార్ ను పాన్ ఇండియా మార్కెట్ కు ఇంట్రడ్యూస్ చేసినట్లే
త్రివిక్రమ్ ను కూడా తన చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ లోకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నాడు ఐకాన్.