డిసెంబర్ 16న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వచ్చింది అవతార్ -2.
ప్రీ సేల్స్ బాగా జరగడంతో తొలి రోజు వసూళ్ల పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
సినిమాకు సంబంధించి ఎన్ని ఫార్మాట్స్ అయితే ఉన్నాయో అన్ని ఫార్మాట్స్ లో మూవీ రిలీజ్ కావడంతో
మూవీ లవర్స్ కు ఈ వీకెండ్ డెస్టినేషన్ గా మారింది అవతార్ -2 మూవీ.
అయితే సినిమాలో నిడివి పెరగడం కథ కుడా పేలవంగా ఉండటంతో అవతార్ -2 మిక్స్డ్ టాక్ వచ్చింది.
ఈ టాక్ ఇప్పుడు బయ్యర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తొలి రోజు ఇండియాలో కేవలం 40 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకుంది అవతార్ -2 ఈ వసూళ్లు అవెంజర్స్ ఎండ్ గేమ్ కంటే కూడా చాలా తక్కువ.
ఎండ్ గేమ్ కలెక్షన్స్ 50 కోట్లు దాటాయి. పైగా వచ్చిన 40 కోట్ల వసూళ్లలో దక్షిణాది వాటానే 25 కోట్లు ఉంది.
ఈ లెక్కన నార్త్ ఆడియెన్స్ ఎందుకో థియేటర్ కు రావడానికి ఆసక్తి చూపించడం లేదనే విషయం మరోసారి అర్ధమైంది.
మూడు వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అవతార్ -2 ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజే 1000 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.