కంచెరపాలెం దర్శకుడితో బాలయ్య

By KTV Telugu On 10 November, 2022
image

ఇది కుదిరే పనేనా.. నటసింహం ప్రయోగం చేస్తుందా

కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య దర్శకుడు వెంకటేష్ మహా నిజానికి సుమతి అనే సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు. కాని ఆ మూవీ ఆగిపోయిందని అమెరికా వెళ్లి ఓల్డేజ్ పీపుల్ తో సినిమా తీయాలి
అది ఇఫ్పుడు కదరని పని అందుకే ప్రాజెక్ట్ ను హోల్ట్ లో పెట్టినట్లు తెలిపాడు. పనిలో పనిగా తాను బాలయ్యకు వీరాభిమానిని అని, త్వరలో బాలయ్య తో కలసి ఒక సినిమా చేసే ఆలోచన ఉందని తెలిపాడు. పైగా ఒక ప్రయోగాత్మక కథలో బాలయ్యను చూపిస్తానంటున్నాడు. వెంకటేష్ మహా, బాలయ్య కాంబోలో సినిమా ఎనౌన్స్ మెంట్ రాలేదు. కాని వీరిద్దరు చేతులు కలపబోతున్నారంటూ వచ్చిన వార్తలు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. చిన్నప్పటి నుంచి బాలయ్య సినిమాలు చూస్తూ పెరిగానని ఆదిత్య 369, భైరవద్వీపం చిత్రాలు అంటే తనకెంతో ఇష్టమని తెలిపాడు వెంకటేష్ మహా. అయితే బాలయ్య ఈ యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇస్తాడా అనేది అనుమానం.ఎందుకంటే ముందు వీరసింహారెడ్డి రిలీజ్ కావాలి. ఆ తర్వాత అనిల్ రావిపూడి మూవీ మొదలుకావాలి. ఇంకో వైపు సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ కూడా బాలయ్య డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. వీరందరి తర్వాత బోయపాటి మరోసారి బాలయ్య తో సినిమా తీస్తానంటున్నాడు. మొత్తంగా బాలయ్య మరో రెండేళ్ల వరకు అయితే వెంకటేష్ మహాకు దొరికే అవకాశమే లేదు.