కీరవాణికి పద్మశ్రీ పురస్కారం

By KTV Telugu On 27 January, 2023
image

మొన్న గోల్డెన్ గ్లోబ్, నిన్న ఆస్కార్ కు నామినేషన్ అందుకోవడం
ఈరోజు పద్మశ్రీ పురస్కారం. మొత్తంగా కీరవాణి పేరు, ప్రఖ్యాతలు, గౌరవాలు, ప్రతిష్టలు, ప్రతిభ
ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. త్రిబుల్ ఆర్ కు ముందు కీరవాణి ఎన్నో సినిమాలకు సంగీత దరకత్వం వహించారు. కాని ఈ సినిమాతో కీరవాణి తన కలలో కూడా ఊహించని పురస్కారాలను అందుకోవడం మొదలుపెట్టారు.
మొత్తంగా త్రిబుల్ ఆర్ టీమ్ లో ఇప్పుడు ఇద్దరు పద్మశ్రీ పురస్కార గ్రహీతలు ఉన్నారు. వారు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, మరొకరు కీరవాణి. 80వ దశకం తెలుగు సినీ సంగీతంలో చక్రవర్తి హవా కొనసాగింది. ఆ తర్వాత కీరవాణి రంగప్రవేశం జరిగింది. మనసుకు హత్తుకునే సంగీతానికి కీరవాణి చిరునామాగా మారారు. 1990 జూన్ 29న విడుదలైన మనసు మమత చిత్రంతో కీరవాణి సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకుంది లేదు. 100కు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. ఎక్కువ శాతం దర్శకేంద్రుడి సినిమాలకు సంగీతం అందించారు. వీరిద్దరి కాంబినేషన్ లో 25కు పైగా చిత్రాలు వచ్చాయి. వీటిల్లో అన్నమయ్య కూడా ఉంద. రాజమౌళితో స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో జర్నీ, త్రిబుల్ ఆర్ వరకు కొనసాగింది.