తమిళ సినిమా వేదాళం తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.
ఈ సినిమా పై ఇప్పటికే లెక్కనేనన్ని గాసిప్స్ మొదలయ్యాయి.
వాటిల్లో ఒకటి చిరుతో రామ్ చరణ్ స్టెప్పులు.
అది ఎంతవరకు నిజమో తెలియదు కాని ఇప్పుడు ఈ చిత్రంలో చిరు
ఏకంగా తన తమ్ముడికి వీరాభిమానిగా నటిస్తున్నాడట.
ఆ విధంగా భోళాశంకర్ క్యారెక్టర్ ను మెహర్ రమేష్ డిజైన్ చేసాడట.
భీమ్లానాయక్ సినిమాకు సంబంధించిన సీన్స్ కూడా కనిపిస్తాయట.
అన్నిటికంటే పెద్ద రూమర్ ఏంటంటే చూడాలని ఉంది సినిమాలోని రామ్మా చిలకమ్మా సాంగ్ ను
ఇప్పుడు భోళాశంకర్ లో రీమిక్స్ వర్షన్ లో వినిపిస్తారట. ఒరిజినల్ వర్షన్ ను మణిశర్మ కంపోజ్ చేసాడు.
ఇప్పుడు రీమిక్స్ వర్షన్ ను వారి అబ్బాయ్ మహతీ స్వరసాగర్ కంపోజ్ చేయనున్నాడు.
వేసవి కానుకగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా ఆగస్ట్ లో భోళాను థియేటర్స్ తీసుకురావాలనుకుంటున్నాడట. చిరు.