మెగాస్టార్ మాస్టర్ ప్లాన్.. వెంకీ కుడుముల స్థానంలో నక్కిన?

By KTV Telugu On 31 January, 2023
image

భోళాశంకర్ తో పాటు చిరు ఈపాటికి మరో సినిమా షూటింగ్ లో బిజీగా ఉండాల్సింది.
ఆ సినిమాకు వెంకీ కుడుముల దర్శకుడు. ఛలో, భీష్మ చిత్రాలను చూసి తన ఫ్యాన్ కావడంతో
చిరు తనకు అవకాశం ఇచ్చాడు. ఏకంగా త్రిబుల్ ఆర్ నిర్మించిన దానయ్య బ్యానర్ లోనే మూవీ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కాని వెంకీ మెగాస్టార్ ను మెప్పించే స్టోరీని రాలేకపోయాడు. దాంతో వెంకీ తో సినిమాను క్యాన్సిల్ చేసాడు చిరు.
ఇప్పుడు ఆ స్థానంలో మరో దర్శకుడిని ఎంపిక చేసుకునే పనిలో పడ్డాడు చిరు. మెగాస్టార్ అన్వేషణ ఫలించింది.
ధమాకాతో రవితేజ కెరీర్ లోనే బిగ్ హిట్ అందించి వంద కోట్ల వసూళ్లను కురిపించిన నక్కిన త్రినాథరావుతో సినిమా చేయాలనుకుంటున్నాడట చిరు. అందుకు సంబంధించిన చర్చలు కూడా ప్రారంభమయ్యాయట.
చిరు నటించిన రౌడీ అల్లుడు సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ధమారా తెరకెక్కించాడు నక్కిన త్రినాథరావు.
అలాగే సినిమా సక్సెస్ లో రైటర్ నక్కిన త్రినాథరావు వాటా కూడా ఉంది.
వీరిద్దరి కాంబినేషన్ లోనే మెగాస్టార్ న్యూ మూవీ పట్టాలక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
దానయ్య ఈ మెగా ప్రాజెక్ట్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.