మిగిలిన శేషజీవితాన్ని కూడా కలర్‌ఫుల్‌గా ఎంజాయ్ చేద్దామని నాలుగోపెళ్లికి రెడీ అవుతున్న నరేష్‌ని నిన్నొదలా అంటోంది మూడోభార్య. లిప్‌కిస్‌తో త్వరలోనే పవిత్రతతో తన మాంగల్యబంధం గురించి న్యూఇయర్‌కి ఎనౌన్స్ చేశాడు నరేష్. పెళ్లిచేసుకుంటే పాత పెళ్లాల గోల తప్పుతుందనుకున్నట్లున్నాడు. కానీ పవిత్రా నరేష్‌లను కొన్నాళ్లుగా టార్గెట్ చేసుకుంటున్న మూడోభార్య రమ్య రఘుపతి నీడలా వెంటాడుతోంది. షాకింగ్ కామెంట్స్‌తో మనశ్శాంతి లేకుండా చేస్తోంది.
నరేష్‌కి తానింకా విడాకులు ఇవ్వలేదంటోంది మూడోభార్య రమ్య రఘుపతి. హిందూ సంప్రదాయంలో విడాకులు తీసుకోకుండా మరోపెళ్లి చట్టబద్ధం అవుతుందో లేదో నరేష్ ఆలోచించాలి. విడాకుల కేసు కోర్టులో నడుస్తోందన్నది మూడో భార్య వాదన. ఇంకా చట్టబద్ధంగా విడిపోకముందే పవిత్రతో కలిసి రిలీజ్ చేసిన వీడియోతో ఆమె హర్ట్ అయింది. నాన్నకు విడాకులు ఇవ్వొద్దని కొడుకు చెబుతున్నాడంటూ సెంటిమెంట్‌తో కొట్టింది. నరేష్‌తో కలిసే ఉంటానని తన 11 ఏళ్ల కొడుక్కి మాటిచ్చానని రమ్య రఘుపతి అంటోంది.
త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు నరేష్. తన కంఠంలో ప్రాణం ఉండగా వాళ్లిద్దరి పెళ్లి జరగనివ్వనని అంటోంది మూడో భార్య రమ్య. పవన్‌కళ్యాణ్ ఒకటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు అయిపోయాయి. కానీ నరేష్ విషయంలో మాత్రం ఎందుకో తేడా కొడ్తోంది. నరేష్ బలహీనతలను బయటపెడుతూ రమ్య అతని పరువుతీస్తోంది. నరేష్ డర్టీ వీడియోలు చూస్తాడంటూ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది మూడోభార్య. తన కొడుకు ఆవిషయం చెప్పాడని బాధపడింది. తండ్రిగా బాధ్యతతో ఉండాల్సిన నరేష్ ఛండాలంగా ప్రవర్తిస్తున్నాడని తిట్టిపోసింది. ఇన్ని చెబుతున్నా ఆ ఛండాలాన్ని వదిలించుకోవాలని మాత్రం ఆమె అనుకోవడం లేదు. మరి నాలుగోపెళ్లానికి మూడుముళ్లు వేయడానికి ముందు నరేష్ అడ్డంకులన్నీ క్లియర్ చేసుకోకపోతే అవమానాలు తప్పవేమో!