టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న ధమాకా స్టోరీని ఫస్ట్ కు మెగా పవర్ స్టార్ కు వినిపించారట రైటర్ ప్రసన్న కుమార్, దర్శకుడు నక్కిన త్రినాథరావు. కాని ధమాకా స్టోరీ వినీ సింపుల్ గా రిజెక్ట్ చేసాడట రామ్ చరణ్.
ఆ తర్వాతే ఈ కథ మాస్ రాజా దగ్గరికి వెళ్లిందట. రవితేజ ఎంట్రీతో ఈ సినిమా రేంజ్ మారిపోయింది.
డబుల్ రోల్ ను తనదైన శైలిలో డబుల్ ఫన్ ను పండించి మెప్పించాడు మాస్ రాజా.
అందుకు తగ్గట్లే ఈ మూవీ తొలి 3 రోజుల్లోనే 30 కోట్లకు పైగా రాబట్టింది.
ఈ సంగతి ఇలా ఉంటే రామ్ చరణ్ డేట్స్ కు ఇప్పుడు ఎక్కడలేని గిరాకీ వచ్చేసింది.
ప్రస్తుతం శంకర్ మేకింగ్ లో మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్.
ఆ తర్వాత బుచ్చిబాబుతో మూవీ చేయబోతున్నట్లు ప్రకటించాడు.
ఇప్పుడు ఈ లిస్ట్ లో కన్నడ దర్శకుడు నార్తన్ కూడా చేరిపోయినట్లనే అని బాగా ప్రచారం సాగుతోంది.
మరికొద్ది రోజుల్లో ఇందుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ రానుందట.