సార్ సినిమాతో టాలీవుడ్ కు పర్ఫెక్ట్ డెబ్యూ ఇచ్చాడు ధనుష్.
తమిళంలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను అందుకుంటోంది.
వరల్డ్ వైడ్ గా వసూళ్లు 60కోట్లు దాటినట్లు సమాచారం.
ఈ వీకెండ్ కూడా మరో సినిమా పోటీకి లేకపోవడం,
ధనుష్ మూవీకి బాగా కలిసొచ్చే అంశం.
ఈ సంగతి ఇలా ఉంటే సార్ తర్వాత దీపావళికి కాప్టెన్ మిల్లర్ అనే యాక్షన్ మూవీని రిలీజ్ చేయబోతున్నాడు ధనుష్.
ఆ తర్వాత తన కెరీర్ లో 50వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.
ఈ మూవీని రాయన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
ధనుష్ సొంతంగా దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇక శేఖర్ కమ్ములతో పెండింగ్ లో ఉన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తాను అని చెప్పాడట ధనుష్.
ఏప్రిల్ నుంచి ధనుష్ ఒక వైపు శేఖర్ కమ్ములతో మూవీ చేస్తూనే మరోవైపు తన సొంత సినిమా చేయనున్నాడు.