దిల్ రాజు కోలీవుడ్ పై యుద్దం ప్రకటించినట్లు కనిపిస్తోంది. తన ఆధ్వర్యంలో నడుస్తున్న బ్యానర్ ను టాలీవుడ్ దాటించి కోలీవుడ్ లోను బలంగా జెండా ఎగరేయాలనే తాపత్రయం కనిపిస్తోంది. విజయ్ తో వారీసు తీసి ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లు రాబట్టాడు దిల్ రాజు. ఇప్పుడు కోలీవుడ్ లో మరో ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రెండేళ్ల క్రితం దర్బార్ సినిమా తీసి మళ్లీ కనిపించకుండా పోయిన మురగదాస్ మేకింగ్ లో
ఒక భారీ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఈ మూవీలో తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా నటించబోతున్నాడట. తెలుగుతో పాటు తమిళ, కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ముందు వారీసు, ఇప్పుడు శివకార్తికేయన్ తో సినిమా ఫ్యూచర్ లో ధనుష్ తో కూడా దిల్ రాజు ఒక సినిమా ఎనౌన్స్ చేయనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది.