తమిళనాడులో జరిగిన వారసుడు ఆడియో లాంఛ్ లో దిల్ రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసాడు.
తమిళనాడులో ప్రస్తుతం విజయ్ మాత్రమే నెంబర్ వన్ అంటూ గతంలో తాను చేసిన కామెంట్స్ ను అదే వేదికపై రిపీట్ చేసాడు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఆ ప్రాంగణం మొత్తం వన్ వన్ నెంబర్ వన్ కేకలతో మార్మోగింది. దిల్ రాజు వ్యాఖ్యలను అక్కడి నటీ నటులు చాలా వరకు వత్తాసు పలికారు.
మరో విషయం ఏంటంటే వచ్చే సంక్రాంతికి అటు తమిళంలో ఇటు తెలుగులో, నార్త్ లోనూ వారసుడే బాక్సాఫీస్ ను రూల్ చేస్తాడని చెప్పుకొచ్చాడు దిల్ రాజు. మరో విశేషం ఏంటంటే ఈ సినిమా గతంలో తెలుగులో వచ్చిన బృందావనం సినిమాకు రీమేక్ అని ప్రచారం జరుగుతోందని, అందులో ఎలాంటి నిజం లేదని, స్ట్రెయిట్ మూవీ అని చెప్పడం మాత్రమే కాదు. వారసుడు ముమ్మాటికి తమిళ సినిమా అనే చెప్పుకొచ్చాడు దిల్ రాజు. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న వారసుడు ను భారీ బడ్జెట్ తో నిర్మించాడు దిల్ రాజు.