సరిగ్గా ఇదే సంక్రాంతి సీజన్ కు రజనీకాంత్ తో దర్బార్ లాంటి సినిమా తీసి
బ్లాక్ బస్టర్ కొడతాడు అనుకున్న దర్శకుడు మురుగదాస్.
కాని ఈ సినిమా ఫెయిల్యూర్ కావడంతో మళ్లీ సెట్ లో కనిపించలేదు.
అంతకు ముందు స్పైడర్ తీసి చేతులు కాల్చుకున్నాడు.
ఈ దశలో సినిమా చేస్తాను అని మాట ఇచ్చిన విజయ్ అసలు పట్టించుకోవడం మానేశాడు.
దాంతో రెండేళ్లుగా ఇంటికే పరిమితం అయ్యి తన కమ్ బ్యాక్ కోసం స్టోరీని రెడీ చేసుకుంటూ ఉండిపోయాడు మురుగదాస్.
ఈ రెండేళ్ల కాలంలో మురుగదాస్ కొత్త సినిమా పై చాలా రూమర్స్ వినిపించాయి.
ఒకసారి అజిత్ తో చేస్తున్నాడని మరోసారి శింబుతో మూవీ లాక్ అయిందని చాలా రూమర్స్ వచ్చాయి.
కాని వీటిల్లో ఏది కూడా కన్ ఫామ్ కాలేదు. ఇప్పుడు తమిళ హీరో శివకార్తికేయన్ తో
మురుగదాస్ పాన్ ఇండియా మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడని కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తోంది.
డాక్టర్, డాన్ సినిమాలతో తమిళంలో శివకార్తికేయన్ మార్కెట్ బాగా పెరిగింది.
పైగా ప్రిన్స్ తో తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం అయ్యాడు. హిందీ మార్కెట్ లోనూ కొంత ఫ్యాన్స్ ఉన్నారు.
అందుకే శివకార్తికేయన్ తో మురుగదాస్ మూవీ ఫిక్స్ చేసుకున్నాడని టాక్ వినిపిస్తోంది.