ఈ ఏడాది కోలీవుడ్ చాలా అద్భుతాలను చూసింది. వాటిల్లో లవ్ టుడే ఒకటి. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్లను రాబట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా 10కోట్లకు పైగానే ఉంది.
లవ్ టుడే తర్వాత ఈ సినిమా హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ చేయబోయే సినిమా పై చాలా అంచనాలు ఉన్నాయి.
ఒక దశలో విజయ్ తో మూవీ చేయబోతున్నాడంటూ ప్రచారం సాగింది. కాని విజయ్ ఇతర ప్రాజెక్ట్స్ లోబిజీగా ఉన్నాడు.
దాంతో ప్రస్తుతం ప్రదీప్ తో వర్క్ చేసేందుకు రజనీకాంత్ ఆశక్తి చూపిస్తున్నారట. కొంత కాలంగా యంగ్ డైరెక్టర్స్ కు వరుసగా అవకాశాలు ఇస్తున్నాడు తలైవా. ఇదే జోరులో లవ్ టుడే మేకర్ తో మూవీ చేయబోతున్నాడంటూ కోలీవుడ్ కోడై కూస్తోంది. జైలర్, లాల్ సలామ్ మూవీస్ తర్వాత రజనీకాంత్ చేయబోయే మూవీ ఇదే నని తెలుస్తోంది.
ప్రస్తుతం రజనీకాంత్ కోసం స్టోరీ రెడీ చేసే పనిలోనే ప్రదీప్ రంగనాథన్ లండన్ లో స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నాడని టాక్ వినిపిస్తోంది.