రాజమౌళి మూవీస్ అనగానే కళ్లకముందుకు కత్తులు, భారీగా కనిపించే హీరో కటౌట్లు
వారు చెప్పిన ఫేమస్ డైలాగ్స్ గుర్తుకొస్తాయి. కాని ఇకపై రాజమౌళి అనగానే లవ్ స్టోరీ కూడా గుర్తొచ్చేవిధంగా ఒక సినిమా చేయాలనుకుంటున్నాడట రాజమౌళి. పైగా జక్కన్న ప్రేమకథా చిత్రం వచ్చేందుకు ఏళ్లకు ఏళ్లు సమయం ఏం పట్టదు.
ఎందుకంటే మహేష్ తో మూవీ తర్వాత ఇమిడియెట్ గా రాజమౌళి మార్క్ లవ్ స్టోరీ సెట్స్ పైకి వెళ్లనుందట.
ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడట. స్టూడెంట్ నెం1 మూవీ నుంచి రాజమౌళి కేవలం మాస్ జపం చేస్తూ వస్తున్నాడు. తన సినిమాల్లో కూడా ప్రేమకథ ఉంటుంది. ప్రేమ పాటలు ఉంటాయి. కాని అవి సినిమాను రాజమౌళి మార్క్ మాస్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్స్ డామినేట్ చేస్తాయి. మరి పూర్తి స్థాయిలో జక్కన్న ఎలా డీల్ చేస్తాడో చూడాల్సి ఉంది.
మరోవైపు రాజమౌళి ముందు RRR 2 కూడా ఉంది.