టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లికి రెడీ అవుతున్నాడు. ఈ సంగతి ఆల్రెడీ తెలిసిందే.
అయితే శర్వానంద్ మనసు దోచిన ఆ అమ్మాయి ఎవరూ అనేది ఇండస్ట్రీలో
ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొని ఉంది.
ప్రముఖ రాజకీయ నాయకుడి కుటుంబం నుంచే
శర్వానంద్ జీవితంలో ఒక అమ్మాయి అడుగు పెడుతోందని ముందు నుంచి వార్తలు వినిపించాయి.
ఇఫ్పుడు అదే వార్తలు నిజమయ్యాయి. శర్వానంద్‌కు కాబోయే భార్య పేరు రక్షితా రెడ్డి అట.
ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అని రక్షితా రెడ్డి తండ్రి మధుసూదన రెడ్డి హైకోర్టు లాయర్ అని తెలుస్తోంది.
సీనియర్ టీడీపీ నాయకులు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అల్లుడు గంగారెడ్డికి రక్షితా రెడ్డి మేనకోడలు అవుతుందట.
ఏది ఏమైనా శర్వానంద్ రక్షితారెడ్డి వెడ్డింగ్ మ్యాటర్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
త్వరలోనే వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఇన్విటేషన్ కార్ట్ బయటికి రానుందట.
తెలుగు తెరపై ఎంతో మంది హీరోలున్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వా.
ఒకే ఒక జీవితం తర్వాత శర్వానంద్ చేయాల్సిన కొత్త సినిమాకు బ్రేక్ పడింది.
ఇక మ్యారేజ్, హనీమూన్ తర్వాతే మహానుభావుడు కొత్త సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.