కొత్త సినిమాలపై కమల్ ఫుల్ క్లారిటీ
విక్రమ్ తో కమ్ బ్యాక్ ఇచ్చింది మొదలు కమల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
దాంతో రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమలు చేస్తున్నాడు.
విక్రమ్ కంటే ముందు కమల్ చాలా చిత్రాలు ప్లాన్ చేసాడు.
కాకపోతే ఇప్పుడు మాత్రం వాటిల్లో కొన్నిటిని మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నాడు.
ఇప్పటికే శభాష్ నాయుడు పక్కకు వెళ్లిపోయింది.
ఇప్పుడు క్షత్రియ పుత్రుడు -2 కూడా ఆగిపోయినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
1992లో వచ్చిన క్షత్రియపుత్రుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కే చిత్రంలో కమల్ హాసన్, ఫాహద్ ఫాజిల్ తండ్రి కొడుకులుగా నటించాలనుకున్నారు. కాని కమల్ ఇప్పుడు ఈ సీక్వెల్ పై ఇంట్రెస్ట్ కోల్పోయాడు.
భారతీయుడు -2 రిలీజ్ తర్వాత తమిళ దర్శకుడు వినోద్ తో ఒక సినిమా, మణిరత్నంతో మరో మూవీ చేయాలనుకున్నాడు లోకనాయకుడు. ఈ దశలో క్షత్రియ పుత్రుడు -2 కోసం డేట్స్ కేటాయించడం సబబు కాదని
ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాడట. ప్రస్తుతం భారతీయుడు -2 షూట్ లో బిజీగా ఉన్నాడు కమల్.
వచ్చే ఏడాది దీపావళికి ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలనే తాపత్రయంతో ఉన్నాడు కమల్.