లోకనాయకుడికి స్వల్వ అస్వస్థత

By KTV Telugu On 24 November, 2022
image

జ్వరం తో బాధపడుతున్న కమల్
ఆసుపత్రి నుంచి ఈ ఉదయమే డిశ్ఛార్జి

నిన్న హైదరాబాద్ లో కళాతపశ్వి కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకుని చెన్నైకి చెరుకున్నారు కమల్.
చెన్నైకి చేరుకోగానే జ్వరం తో కమల్ ఇబ్బంది పట్టాడు. ఆ వెంటనే అక్కడి శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో అడ్మిట్ అయ్యారు. జ్వరం స్వల్పంగా ఉండటంతో రాత్రంతా ఆసుపత్రిలోనే ఉన్నారు కమల్. ఈ ఉదయం వైద్యులు డిశ్ఛార్జ్ చేసారు. మరి కొద్ది రోజుల పాటు కమల్ ను ఇంటివద్దే ఉండి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. గత కొద్ది రోజులుగా కమల్ నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఒక వైపు ఇండియన్ -2 షూటింగ్, మరో వైపు బిగ్ బాస్ తమిళ షోల కోసం కమల్ అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు. దాంతో అలసట మీద మాత్రమే ఆయన స్వల్పంగా అనారోగ్యానికి గురైయ్యారు. రెండు, మూడు రోజుల విశ్రాంతి తీసుకున్న అనంతరం కమల్ షూటింగ్స్ కు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.