విక్రమ్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన తర్వాత కమల్ హాసన్ లో ఎక్కడి లేని జోష్ వచ్చింది.
అంతకు ముందు వరకు ప్రయోగాలకు మాత్రమే ప్రాముఖ్యతను ఇచ్చిన లోకనాయకుడు
ఇప్పుడు కమర్షియల్ సినిమాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాడు. భారతీయుడు 2 రిలీజ్ తర్వాత తమిళ దర్శకుడు వినోద్ తో ఒక మూవీ ఉంది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో మరో సినిమా ఉంది. ఈ రెండు చిత్రాల్లో ఒకదాని దాంట్లో కమల్ తో పాటు మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్ కూడా కనిపించబోతున్నాడట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, రజనీకాంత్ ఒక సినిమా చేయాల్సి ఉండగా ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. దాంతో కమల్ ఇంకో మల్టీస్టారర్ సెట్ చేసాడు. మణిరత్నం మూవీలో ఇద్దరు సినిమాటిక్ లెజెండ్స్ కలసి నటిస్తే మాత్రం సౌత్ సినిమా బాక్సాఫీస్ మరోసారి విక్రమ్ విడుదలైనప్పటి రోజును చూడవచ్చు.