కేజీయఫ్ 2 తర్వాత కన్నడ హీరో యశ్ చేయబోయే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే గత ఏడాది కేజీయఫ్ -2 రిలీజ్ తర్వాత రాఖీభాయ్ చేయబోయే నెక్స్ట్ చేయబోయే సినిమాపై ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కేజీయఫ్ -2 అంటే చిన్న బ్లాక్ బస్టర్ కాదు. 2022లోనే ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.
ఇలాంటి ఓ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత తాను చేయబోయే తర్వాత చిత్రం, అంతకు మించే ఉండాలి కాని ఎక్కడా తగ్గకూడదు అనే ఫిక్స్ అయ్యాడు రాఖీభాయ్. అందుకే గత ఏడాది మొత్తం కథలు వింటూ కూర్చున్నాడు.
ఒక దశలో కేజీయఫ్ 3తోనే తిరిగొస్తాను అని చెప్పాడు. కాని అందుకు చాలా సమయం ఉంది. ఈలోపు తెలుగు, తమిళం, కన్నడం, హిందీ మార్కెట్ నుంచి తనకు వస్తున్న ఆఫర్స్ నుంచి ఒకటి ఎంపిక చేసుకుని జనవరి 8న తన పుట్టినరోజు కానుకగా చెప్పాలనుకున్నాడు. కాని ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నానని ఓ మంచి ప్రాజెక్ట్ ఖరారు అయినప్పుడు ఆ విషయాన్ని ముందుగా అభిమానులతో పంచుకుంటాను అని తెలిపాడు యశ్. అంతేకాదు జనవరి 8న తన పుట్టినరోజు వేడుకలకు తాను ఎవరికి అందుబాటులోఉండటం లేదని కాబట్టి అభిమానులు ఎవరూ తనని కలవడానికి రావద్దని ఓ అభిమానికి యశ్ రాసుకొచ్చిన ఉత్తరం ఇప్పుడుబయటికి వచ్చింది.