అదే కాంతార.. అదెలా?
గత రెండు దశాబ్ధాల కాలంలో మీరు ఎప్పుడైనా 50 రోజులు, వంద రోజులు సినిమాల గురించి విన్నారా..
ఒక సినిమా 25 రోజులకు మించి థియేటర్ లో ప్రదర్శింపడం చాలా అరుదు. అన్ని ఇండస్ట్రీస్ లోనూ ఫస్ట్ డే, ఫస్ట్ వీక్, ఫస్ట్ వీకెండ్ లోనే. ఎక్కువ థియేటర్స్, ఎక్కువ కలెక్షన్స్ తో, రాబట్టాలనే తాపత్రయంతో కనిపించేవారు హీరోలు.
కాని ఈ ట్రెండ్ ను బద్దలు కొడుతున్నాయి ప్యాన్ ఇండియా చిత్రాలు. రోజులు, వారాల తరబడి థియేటర్స్ లో ప్రదర్శితం అవుతున్నాయి.
శాండల్ వుడ్ లేటెస్ట్ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతార. థియేటర్స్ లోకి వచ్చి 50 రోజులు దాటింది. అయినప్పటికీ థియేటర్స్ లో ఇంకా ప్రదర్శితం అవుతూనే ఉంది. మరో విశేషం ఏంటంటే ఈ సినిమా మొదటి వారం వసూళ్ల కంటే రెండో వారం అధికంగా ఉన్నాయి. రెండో వారం కంటే మూడో వారం అధికంగా వచ్చాయి. నాల్గవ కూడా సేమ్ ట్రెండ్ కంటిన్యూ అయింది. కేవలం 2 కోట్ల ఓపెనింగ్స్ తో ప్రారంభమైన ఈ సినిమా బాక్సాఫీస్ ప్రస్థానం నేడు దేశంలో వివిధ రాష్ట్రాల్లోవందలాది థియేటర్స్ లో 380 కోట్లు వసూళ్లు కొల్లగొట్టే వరకు వెళ్లింది.
ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏది అంటే మీరు కేజీయఫ్ 2 అనే చెబుతారు. ఎందుకంటే ఈ సినిమా వసూళ్లు 1200 కోట్లు దాటడమే అందుకు కారణం. కాని ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ కేజీయఫ్ 2,లేదా 1100 కోట్లకు పైగా రాబట్టిన RRR కాదు.
కాంతార అని తెల్చారు సినీ పండితులు. 15 కోట్ల బడ్డెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం 20 రెట్లు అధికంగా లాభాలను ఆర్జించడమే అందుకు కారణం. RRR బడ్డెట్ 500 కోట్లుపైనే ఉంది. అలాగే KGF2 బడ్జెట్ కూడా వంద కోట్లు పైనే ఉంది. కాని ఈ రెండు చిత్రాల కంటే 20 కోట్ల బడ్జెట్ లోపల తెరకెక్కిన కార్తికేయ-2, కాంతార చిత్రాలు ఇయర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అనీ పెట్టిన పెట్టుబడికి 20 రెట్లు అధికంగా వసూళ్లు రాబట్టడమే ఈ రెండు చిత్రాలు ఈ ఘనతను అందుకోవడానికి మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు.
అసలు కాంతార, కార్తికేయ2 లాంటి చిత్రాలకు ప్యాన్ ఇండియా ఆడియెన్స్ ఈ స్థాయిలో ఎందుకు ఆదిరించారు.
అంటే అందుకు ఎవరి లెక్కలు వారికున్నాయి. ద్వారకా నగరం రహస్యాలను ఛేదించేందుకు ఒక డాక్టర్ ప్రయత్నించడం, శ్రీకృష్ణుడి విశిష్టతను గొప్పగా వివరించడం కార్తికేయ2 సినిమాను ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని భూతకోల సంస్కృతిని హైలైట్ చేస్తూ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకురావడం కాంతారను ప్యాన్ ఇండియా మార్కెట్ లో మోస్ట్ వాంటెడ్ మూవీగా మార్చింది.