లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ వండర్స్ లో ఒకటి కాంతార. అయితే మనం చూసింది కాంతార -2 అంటున్నాడు రిషబ్.
అంటే కాంతారకు ప్రీక్వెల్ స్టోరీ వేరే ఉందని ఆ కథను త్వరలో తెరకెక్కిస్తానంటున్నాడు.
కాంతార వంద రోజుల వేడుకలో ఈ స్టేట్ మెంట్ ఇచ్చాడు రిషబ్. కాంతార ప్రీక్వెల్ కు సంబంధించిన
స్టోరీ లాక్ అయిపోయింది. దాంతో చిత్ర యూనిట్ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసింది.
మొదటి భాగాన్ని కేవలం 15 కోట్లతో తెరకెక్కించింది హోంబలే ఫిల్మ్స్. కాని ఇప్పుడు పీక్వెల్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కించనుంది. ప్రీక్వెల్ స్టోరీ కోసం భారీ ఎత్తున రీసెర్చ్ వర్క్ చేసారు.
స్క్రిప్ట్ పాన్ ఇండియా ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించబోతున్నారు.
ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన మొదటి భాగం పాన్ ఇండియా మార్కెట్ లో దుమ్మురేపింది.
వరల్డ్ వైడ్ గా దాదాపు 400 కోట్లు రాబట్టింది. మరి రెండో భాగం ఎంత కొల్లగొడుతుంది అనేది ఆశక్తికరంగా మారింది.