సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న రూమర్
సినిమాలను వదిలేయబోతోందా?
త్వరలో కీర్తి సురేష్ పెళ్లి వేడుక జరగనుందా. మ్యారేజ్ తర్వాత సినిమాలను గుడ్ బై చెప్పనుందా, ఏమో ఏదైనా జరగవచ్చు అంటోంది ఫిల్మ్ మీడియా. గత కొద్ది రోజులుగా మహానటికి మ్యారేజ్ అంట. మ్యారేజ్ తర్వాత ఆమె సినిమాల్లో నటించడదట అంటూ బాగా ప్రచారం సాగుతోంది. కాని కీర్తి సురేష్ మాత్రం రూమర్స్ పై స్పందించడం లేదు.
కీర్తి తల్లిదండ్రులు తనకోసం వరుడిని వెతికే ప్రయత్నంలో ఉన్నారట. మంచి అబ్బాయి దొరికితే మాత్రం త్వరలోనే పెళ్లి చేసేస్తారట. ఆ తర్వాత కీర్తి సినిమాల్లో నటించదట. కేవలం నిర్మాతగా మాత్రమే కొనసాగుతుందట.
సర్కారు వారి పాట తర్వాత కీర్తి ప్రస్తుతం నానితో కలసి దసరాలో నటిస్తోంది. అలాగే భోళాశంకర్ తో చిరుకు చెల్లెలి పాత్ర చేస్తోంది. ఇవి రెండూ కాకుండా మరో రెండు తమిళ సినిమాలు చేస్తోంది. ఒకవేళ కీర్తి పెళ్లికి రెడీ అయితే ఈ నాలుగు సినిమాలు మాత్రమే ఆమె కెరీర్ లో బిగ్ ప్రాజెక్ట్స్ గా నిలుస్తాయి. ఒక దశలో సౌత్ ఇండియా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ తో కీర్తి లవ్ అంటూ బాగా ప్రచారం సాగింది. కాని ఎందుకో ఈ లవ్ స్టోరీకి మధ్యలోనే ఫుల్ స్టాప్ పడిందట.