నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోనున్న కేజీయఫ్ -2.. దూసుకుపోతున్న RRR

By KTV Telugu On 1 February, 2023
image

లాస్ట్ ఇయర్ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన చిత్రాలు కేజీయఫ్ -2, త్రిబుల్ ఆర్.
ఈ రెండిటిలో కేజీయఫ్ సీక్వెల్ దాదాపు 1200 కోట్లు రాబట్టి
2022 ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మరో వైపు త్రిబుల్ ఆర్ 1150 కోట్లు రాబట్టి
రెండవ అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదీ ఇప్పటి వరకు లెక్క.
ఇప్పటికీ కేజీయఫ్ -2 నంబర్ వన్ పోజీషన్ లో కంటిన్యూ అవుతోంది.
అయితే జపాన్ లో త్రిబుల్ ఆర్ వసూళ్లను పెంచుకుంటూ పోవడం
50 కోట్లకు పైగా వసూళ్లను టార్గెట్ చేయడంతో
కేజీయఫ్ -2 నెంబర్ వన్ పోజీషన్ డేంజల్ లో పడే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం జపాన్ లో ఈ చిత్రం 45 కోట్లు రాబట్టింది. మరో 20 కోట్లు కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయట.
ఆస్కార్ బరిలో ఈ చిత్రం నిలవడం జపాన్ లో కలెక్షన్స్ పెరుగుదలకు ఒక కారణంగా చెప్పుకొస్తున్నారు.
మొత్తంగా జపాన్ కలెక్షన్స్ ఒక ఇండియన్ బ్లాక్ బస్టర్ రికార్డులను తారు మారు చేయడాన్ని ఎప్పుడో ఒకసారి జరిగే అద్భుతంగా చెప్పుకొస్తున్నారు సినిమా పండితులు