తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది కియారా అద్వాని.
చేసింది రెండే చిత్రాలైనప్పటికీ రెండూ కూడా స్టార్స్ నటించిన మూవీస్ కావడంతో కియారాకు తెలుగులో భారీ స్థాయిలో అభిమానులు ఏర్పడ్డారు. ఇక బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. బీటౌన్ లో అత్యఅధిక విజయాలు అందడంతో వెంటనే స్టార్ లీగ్ లోకి వెళ్లి పోయింది. అక్కడ అప్పటికీ ఆలియా భట్ తో లవ్ రిలేషన్ కు బ్రేకప్ చెప్పిన సిద్ధార్థ్ మల్హోత్రాతో స్నేహం పెరిగింది. ఆ తర్వాత వీరిద్దరు కలసి షేర్ షా అనే మూవీలో నటించారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. గత రెండేళ్లుగా నిండా ప్రేమలో మునిగి తేలుతున్న కియారా సిద్ధార్థ్ ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 6న రాజస్థాన్ రాష్ట్రంలో గల సూర్యగ్రహ్ మహల్ లో భారీ ఎత్తున వివాహ మహోత్సవం జరగనుంది. ఫిబ్రవరి 4 నుంచే పెళ్లి సందడి మొదలు కానుంది. సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాల అనంతరం వివాహ వేడుక జరగనుంది. వీరిద్దరి పెళ్లి వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున తారలు తరలి వెళ్లనున్నారు. కియారా క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ లో రామ్ చరణ్ ఉన్నాడు. అతను కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పైగా వీరిద్దరు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మరోసారి కలసి నటిస్తున్నారు.