వరుణ్ కామెడీ మాత్రమే చేసాడు
ప్లీజ్ మా పెళ్లి డేట్ ను కూడా ఫిక్స్ చేయకండి
మొదట ఎవర్నీ పెళ్లి చేసుకుంటారు అంటే ప్రభాస్ పేరు చెప్పింది కృతి సనన్.
ఆ తర్వాత కృతి మనసు నాన్ బాలీవుడ్ హీరో దోచుకున్నాడని ప్రస్తుతం ఆ హీరో దీపికతో సినిమా చేస్తున్నాడని
వరుణ్ ధావన్ చెప్పినప్పుడు సిగ్గుపడింది కృతి. ఇప్పుడు ఈ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సమయంలో
ప్రేమ, ప్యార్, ఇష్క్ లాంటి పదాలు తన జీవితంలో లేవని అది తోడేలు సినిమా హీరో చేసిన కామెడీ అని తేల్చేసింది కృతి సనన్. తనకు ప్రభాస్ కు ప్రేమ ఉందని నమ్మి అర్జెంటుగా పెళ్లి డేట్ ఫిక్స్ చేయవద్దని బాలీవుడ్ మీడియాకు రిక్వెస్ట్ కూడా చేసింది కృతి. మరో వైపు ఆదిపురుష్ సినిమాను సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే.
జూన్ లో రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. విడుదల సమయానికి వీరిద్దరు ప్రమోషన్స్ లో పాల్గొంటే రిలేషన్ ఎలా ఉంటుందో చూడాలని బాలీవుడ్ మీడియా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.