దక్షిణాది స్టార్ హీరోయిన్ నయన తార సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. సినీపరిశ్రమలో హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న అంతరం గురించి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెట్టింది. హీరోలకు ఇచ్చేంత ప్రాధాన్యతను హీరోయిన్లకు ఇవ్వరని అందుకే తాను సినిమా ఈవెంట్స్ కు వెళ్లడం మానేశానని స్పష్టం చేసింది. తాను హీరోయిన్ గా నిలదొక్కుకున్న తరువాత తనకంటూ కొన్ని డ్రీమ్ రోల్స్ ఉండేవని ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలనే కోరిక ఉండేదని చెప్పింది. అయితే ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదని తెలిపింది నయన తార. ఆడియో ఫంక్షన్లకు హాజరయ్యే హీరోయిన్లను ఏ మూలనో నిలబెట్టే పరిస్థితి ఉండేదని చెప్పింది.
ఈ కారణాల వల్లే తాను సినిమా ఈవెంట్లకు వెళ్లడం మానేశానని వెల్లడించింది ఈ లేడీ సూపర్‌స్టార్. నయనతార లీడ్ రోల్‌లో నటించిన కనెక్ట్ ఈమధ్యే విడుదలైంది. గతవారం తన భర్త విఘ్నేష్‌తో కలిసి ఈ సినిమా ప్రీమియర్ షో చూడ్డానికి చెన్నైలోని ఒక థియేటర్‌కు వెళ్లింది. మూడు నెలల తరువాత నలుగురిలో కనిపించిన నయన తార ఆమె భర్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు చేసి కొంతమంది నయనతారను ట్రోల్ చేస్తున్నారు. ఆమె డ్రెస్సింగ్ మీద కొందరు నెటిజెన్లు అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై సింగర్ చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి కామెంట్లు చేసేవాళ్లను దూరం పెట్టాలని తన ఇన్‌స్టాగ్రామ్‌లో మండిపడ్డారు. ట్రోల్ చేస్తున్నవారు తల్లిపాలు తాగి పెరిగినవారేనా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.