పదేళ్ల క్రితం తమిళనాడులో లింగుస్వామి సినిమాలు అంటే చాలా క్రేజ్.
ఎందుకంటే పందెంకోడి, అవారా, వెట్టై లాంటి సూపర్ హిట్స్ తీసి స్టార్ దర్శకుడిగా మారాడు లింగుస్వామి. ఆ తర్వాత మాత్రం లింగుస్వామి తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చాడు. గత పదేళ్లలో ఫ్లాపులు కాదు డిజాస్టర్లు అందించాడు.
పందెంకోడి సీక్వెల్, ది వారియర్ లాంటి చిత్రాలు తీసి అటు తమిళంలో ఇటు తెలుగులో చేతులు కాల్చుకున్నాడు.
ఇలాంటి దర్శకుడికి ఇప్పుడు కమల్ ఎలా డేట్స్ ఇచ్చాడు అనేది కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే అది వేరే స్టోరీ ఉంది. పదేళ్ల క్రితం లింగుస్వామి స్టార్ డైరెక్టర్ గా వెలుగుతున్న రోజుల్లోనే నిర్మాతగా మారాడు. తన తమ్ముడు సుభాష్ చంద్రబోస్ తో కలసి తిరుపతి బ్రదర్స్ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసాడు.
2007 నుంచి 2016 వరకు ఈ బ్యానర్ చాలా బిజీగా కనిపించింది. ఆ తర్వాతే డల్ అయింది.
తిరుపతి బ్రదర్స్ బాగా బిజీగా ఉన్న సమయంలో కమల్ హాసన్ హీరోగా లింగుస్వామి నిర్మాణంలోనే ఉత్తమ విలన్ సినిమా తెరకెక్కింది. అయితే ఈ చిత్రం అప్పట్లో నిరాశపరచడంతో కమల్ భవిష్యత్ లో లింగుస్వామితో సినిమా తీస్తాను అనే మాట ఇచ్చాడట. ఇప్పుడు విక్రమ్ తో కమల్ గొప్ప కమ్ బ్యాక్ ఇవ్వడంతో కమల్ గతంలో తనకు ఇచ్చిన మాట గుర్తు చేస్తూ త్వరలోనే కమల్ తో సినిమా చేస్తాను అంటున్నాడు లింగుస్వామి.