త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించే కొత్త చిత్రం షూటింగ్ ఎగ్జాట్ గా ఎప్పుడు మొదలవుతుంది అంటే
ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ సినిమాను నిర్మిస్తున్న హారికా హాసిని వారు చెప్పలేరు. ఎందుకంటే మహేష్ అండ్ ఫ్యామిలీ ప్రస్తుతం లండన్ లో విహరిస్తున్నారు. ఇక త్రవిక్రమ్ ఏమో ఇంకా స్టార్ కాస్ట్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డాడు. నిన్నటి వరకు ఈ సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ అని ప్రచారం సాగింది. కాని ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కాని
శ్రీలీల తప్పుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. రెగ్యూలర్ షూటింగ్ స్టార్టింగ్ కు ముందు
ఈ డిస్టర్ బెన్స్ ఏంటని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. త్రివిక్రమ్ కూడా అదే టెన్షన్ లో ఉన్నాడు. అందుకో మరో కథానాయిక కోసం అన్వేషిస్తున్నాడు. మహేష్ బాబు మూవీలో ఛాన్స్ అంటే చిన్న విషయం కాదు. అయినా ధమాకా బ్యూటీ మూవీ నుంచి ఎందుకు తప్పుకుంది అనేది ఇఫుడు ఆశక్తికరంగా మారింది. ధమాకా 100 కోట్లు చేరుకోవడంతో
శ్రీలీల టార్గెట్ మారిందా సెకండ్ హీరోయిన్ రోల్స్ చేస్తే తన కెరీర్ కు ఇబ్బంది అని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుందని టాక్ వినిపిస్తోంది. పైగా శ్రీలీల చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. బాలయ్య, రామ్, అనగనగా ఒక రాజు చిత్రాలు ఉన్నాయి. వీటికి డేట్స్ అడ్జెస్ట్ చేయడమే శ్రీలీలకు కష్టంగా మారినట్లు తెలుస్తోంది. అందుకే మహేష్ తో చేయాల్సిన మూవీని వదులుకుందట.