చిన్న స్టేట్ మెంట్లు కాస్త పెద్దవై పోతున్నాయి. మధ్యలో పార్టీ నేతలు, అభిమానులు కొట్టుకోవడంతో వివాదం మరితంగా ముదురుతోంది. అల్లు అర్జున్ సంగతి తేల్చేస్తామని మెగాభిమానులు అంటుంటే, అసలు మీకు అంత సీన్ లేదని అల్లూ ఆర్మీ సమాధానమిస్తోంది. ఈ లోపు ఫేడవుట్ అయిన కొందరు రంగ ప్రవేశం చేసి మొత్తం వివాదాన్ని లైవ్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా వైసీపీ కూడా నేను సైతం అంటూ ఆజ్యం పోసే ప్రయత్నంలో ఉంది. అసలు వాళ్లు మాత్రం డైరెక్టుగా మాట్లాడటం లేదు….
మెగా ఫైట్ హయ్యస్ట్ పాయింట్ కు వెళ్లిపోయింది. పవన్ వర్సెస్ అల్లు అర్జున్ అనుకున్న వివాదం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీగా మారిపోయింది. మీరు ఒకటి అంటే మేము పది అంటాం అన్నట్లుగా ఒకరికొకరు గట్టిగా సమాధానం చెప్పుకుంటున్నారు.నిజానికి ఇప్పుడు మెగా కుటుంబంలో భారీ చీలిక కనిపిస్తోంది పైగా కొందరు జనసేన నేతలు ఇస్తున్న స్టేట్ మెంట్స్ కూడా ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటివరకు మెగా కాంపౌండ్ నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ వచ్చారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ సైతం మెగా ఫ్యామిలీ గానే భావించేవారు. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాల పుణ్యమా అని మెగా కుటుంబం వేరు, అల్లు కుటుంబం వేరు అన్నట్టు పరిస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ తన స్నేహితుడు అయిన శిల్పా రవి కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఆయన నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు తన ట్విట్టర్ ద్వారా మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లి నేరుగా పవన్ కళ్యాణ్ ను కలిసి మద్దతు ప్రకటించారు. కానీ అప్పటినుంచి అభిమానుల మధ్య స్పష్టమైన చీలిక వచ్చింది. ఈ లోపు ఒక కార్యక్రమంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లుుగా తయారయ్యాయి. పవన్ కల్యాణ్ ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఆయన అటవీ మంత్రి. ఆ శాఖకు చెందిన అంశాలపై మాట్లాడేందుకే వెళ్లారు. ఆ సమయంలో సినిమాల్లో ఎర్ర చందనం స్మగ్లర్లే హీరోలుగా ఉంటున్నారని యథాలాపంగా ఓ మాట అన్నారు. అది అల్లు అర్జున్ ఉద్దేశించే అన్నారని అనేక విశ్లేషణలు చేసుకున్నారు.చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్ కూడా మెగా ఫ్యాన్స్ కు పెద్దగా రుచించలేదు. అనూహ్యంగా .. తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అర్జున్ పై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరినట్లయింది. ఆయన అర్జున్ పై నేరుగా విమర్శలు గుప్పించారు. సొంత తండ్రిని గెలిపించుకోలేకపోయారని కూడా విమర్శించారు. అర్జున్ కు అసలు ఫ్యాన్స్ లేరని..అంతా మెగా ఫ్యాన్సేనని చెప్పుకొచ్చారు. ఈ మాటలు ఖచ్చితంగా మరింత చిచ్చు పెట్టేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బొలిశెట్టిపై విమర్శలు గుప్పించారు. అసలు ఆయన జనసేన నాయకుడు కాదని వేరే పార్టీ నుంచి వచ్చారని గుర్తు చేశారు. గతంలో ఆయన పవన్ కల్యాణ్ ను దూషించిన వీడియోను షేర్ చేయడం మొదలు పెట్టారు. బొలిశెట్టి లాంటి వాళ్లు జనసేనలో చాలా మంది ఉన్నారంటూ ఎదురుదాడి చేశారు. నిజానికి ఇదంతా వైసీపీ వాళ్లు చేయిస్తున్నట్లుగా కూడా మెగాభిమానులు అనుమానిస్తున్నారు. అల్లు అర్జున్ కు అంత రేంజ్ అభిమానులు లేరని, తెరవెనుక కళాకారులే ఈ పని చేయిస్తున్నారని వారు లెక్కలేస్తున్నారు. ఇక ఇదంతా కొనసాగుతున్న సమయంలో పూనమ్ కౌర్, అల్లు అర్జున్ కి మద్దతు పలికేలా ఒక ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ , స్నేహ దంపతుల పక్కనే కూర్చున్న పూనమ్ కౌర్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి లవ్ ప్రేయర్స్ అండ్ హార్మోని అంటూ రాసుకొచ్చింది. అంటే అల్లు అర్జున్ కి ప్రేమ పంచుతూనే వారి కోసం ప్రార్థిస్తున్నానంటూ ఆమె రాసుకొచ్చింది.. ఒకరకంగా చెప్పాలంటే మెగా వర్సెస్ అల్లు అనేది పేరుకే కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నట్టుగానే సోషల్ మీడియా వార్ జరుగుతుంది
ఇప్పుడీ వివాదం పొలిటికల్ సినిమా స్టోరీగా మారే ప్రమాదం ఏర్పడింది.ఎవరూ తగ్గే అవకాశం కనిపించడం లేదు. పవన్ ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్ బ్రిగేడ్ కావడంతో వాళ్లు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదనిపిస్తోంది. పైగా వైసీపీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో కథ రసవత్తరంగా సాగబోతోంది. మరి చిరంజీవి లాంటి పెద్ద మనిషి జోస్యం చేసుకుని సర్దిచెబుతారో లేదో చూడాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…