మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇవ్వబోయిన రామ్ చరణ్

By KTV Telugu On 5 March, 2023
image

త్రిబుల్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లో రామ్ చరణ్ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు.
త్రిబుర్ ఆర్ లో నటించమని రాజమౌళి అడక్కపోయి ఉంటే కనుక వినయ విధేయ రామ తర్వాత
సినిమాలకు బ్రేక్ తీసుకోవాలని రామ్ చరణ్ అనుకున్నాడట. ఏదైనా కొత్త నేర్చుకుని
సినిమాల్లోకి తిరిగి రావాలనుకున్నాడట. సరిగ్గా అలాంటి సమయంలోనే త్రిబుల్ ఆర్ కోసం జక్కన్న పిలిచాడట.
త్రిబుల్ ఆర్ తో రాజమౌళి అందించిన ధైర్యంతో మరో పదేళ్లు కెరీర్ ను కొనసాగిస్తానని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.
గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసాడు. ఖుషి మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా
సినిమాల నుంచి విరామం తీసుకోవాలి అనుకున్నాడట. అదే సమయంలో త్రివిక్రమ్ వచ్చి అతడు కథ చెబితే
అతనికి నచ్చలేదు వినలేదు. ఇప్పుడు అలాంటి స్టోరీనే అబ్బాయ్ కూడా చెబుతున్నాడు.
కోట్లాది మంది అభిమానుల ఆరాథ్య దైవంగా వెలుగుతున్నారు మెగా హీరోలు.
వీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలనుకుంటారని తెరకు దూరం కావాలనుకుంటారని ఎవరూ ఊహిస్తారు చెప్పండి.