భళాశంకర్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కాని చిరు ఆ తర్వాత చేయబోయే సినిమాపై రూమర్లు మొదలయ్యాయి.
ఇప్పటికే పలువురు దర్శకుల పేరు వినిపించిన సంగతి తెలిసిందే.
తాజా రైటర్ రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన మచ్చరవి పేరు బాగా వినిపిస్తోంది.
మచ్చరవి గతంలో వాంటెడ్, జవాన్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
కాని సక్సెస్ అందుకోలేకపోయాడు. కాని ఇప్పుడు మెగాస్టార్ కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసాడట.
ఆ స్టోరీ చిరుకు బాగా నచ్చిందట. ఈ సంగతి పక్కనపెడితే తన కూతురు సుష్మిత నెలకొల్పిన గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ లో ఒక చిత్రం చేయాలనుకుంటున్నాడట. ఈ బ్యానర్ లో మూవీని తెరకెక్కించే బాధ్యతను ధమాకా దర్శకుడు నక్కిన త్రినాథరావు అందుకున్నాడని టాక్. మరి వీరిలో ఎవరికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు మెగాస్టార్ కోసమే స్టోరీస్ రెడీ చేస్తున్నారు వినాయక్ పూరి జగన్నాథ్.
మరి వీరి సంగతి ఏంటి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం భోళాశంకర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చిరు.
ఈ చిత్రాన్ని ఆగస్ట్ లో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. తమిళ సినిమా వేదాళం ను మార్పులు చేర్పులు చేసి మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు.