మెగాస్టార్‌ చిరంజీవిపై విషప్రయోగం.. స్వయంగా వెళ్లడించిన చిరంజీవి

By KTV Telugu On 12 January, 2023
image

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినిమా వెండితెరపై చెరగని సంతకం. స్వయంకృషితో ఒక్కో మెట్టే ఎక్కుతూ తనను తాను మల్చుకున్న నట శిఖరం. తన అభినయం, డ్యాన్సులు, ఫైట్లతో యువతను ఉర్రూతలూగించారు. అభిమానులు ఆప్యాయంగా అన్నయ్యా అని పిలుచుకునే చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య విడుదలయ్యింది. ఈ సందర్భంగా ఆయన ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక సంచలన విషయం బయటపెట్టారు. గతంలో ఒకసారి తనపై విషప్రయోగం జరిగిందని వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే.

1988లో మరణ మృదంగం సినిమా షూటింగ్ ఔట్ డోర్ లో జరుగుతోంది. ఆ సందర్భంగా సెట్స్ లో కేక్ కట్ చేశాము.. అప్పుడు ఒక అభిమాని తోసుకుని వచ్చి తనకు స్వయంగా కేక్ తినిపించాడు.. తనకు స్పూన్ తో కేక్ తినే అలవాటు లేదు అందుకే ఆ అభిమాని చేత్తోనే కేక్ తినిపిస్తే తిన్నానని అన్నారు చిరంజీవి. అయితే ఆ కేక్ తనకు చేదుగా అనిపించడంతో వెంటనే దాన్ని ఉమ్మేశానని చెప్పారు. అప్పుడు తన పక్కనే ఉన్న చిత్ర నిర్మాత కేఎస్ రామారావుకి కేక్‌లో ఏదో కలిపి ఉంటారనే అనుమానం వచ్చి ఆ అభిమానిని పట్టుకున్నారని చిరంజీవి చెప్పారు. ఆ వ్యక్తి తెచ్చిన కేక్ ను పరీక్షకు పంపిస్తే అందులో ఏదో కలిపారని తేలింది. దాంతో కేఎస్ రామారావు ఆ వ్యక్తిని రెండు దెబ్బలు వేశారు అప్పుడు ఆ వ్యక్తి అసలు విషయం చెప్పారు. కేరళ నుంచి వశీకరణ పదార్థాన్ని తెచ్చి తినిపించే ప్రయత్నం చేశానని చెప్పాడని చిరంజీవి వెల్లడించారు. అయితే అతన్ని ఏమీ చేయొద్దు వదిలేయమని చెపితే కేఎస్ రామారావు వదిలేశాడని చెప్పారు. ఇంతకీ ఆ వ్యక్తి అలా ఎందుకు చేశాడంటే. అతనితో చిరంజీవి మాట్లాడలేదట. అందుకే వశీకరణ పౌడర్‌ తెచ్చి కేకులో కలిపి తినిపించాడట. ఈ వివరాలన్నీ స్వయంగా చిరంజీవే వెల్లడించారు.