చిన్న బ్రేక్ ఇచ్చిన కింగ్ మార్చి నుంచి తగ్గేదేలే

By KTV Telugu On 23 February, 2023
image

ఘోస్ట్ దెబ్బకు కింగ్ అడుగులు వెనక్కి పడ్డాయి. దాంతో కొత్త సినిమాను మొదలు పెట్టడానికి
కాస్త సమయం తీసుకున్నాడు నాగార్జున. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయింది.
ఒక సినిమాకు కాదు రెండు చిత్రాలకు గురి కుదిరింది. ముందుగా మార్చి నుంచి ప్రసన్న కుమార్ దర్శకత్వంలో
ఒక మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాడు. మాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన పొరింజు మరియం జోస్ అనే మూవీని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నాడు ప్రసన్న కుమార్. ఈ మూవీలో కింగ్ తో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. వచ్చే నెలలో మైసూరులో కీలకమైన షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఇదే ఏడాది మూవీని విడుదల చేయనున్నారు. అదే విధంగా వచ్చే ఏడాది నాగార్జున నటించే 99వ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీని గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించనున్నాడు.
నాగార్జున అఖిల్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను కథను సిద్దం చేసాడు మోహన్ రాజా.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు సమాచారం. మొత్తంగా ఈ ఏడాది ఒక సినిమాను
వచ్చే ఏడాది మరో మూవీని విడుదల చేయాలని కింగ్ డిసైడ్ అయ్యాడు. ఇది అక్కినేని ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్తే.