వీరసింహా రెడ్డి విజయోత్సవ వేడుకలో నందమూరి బాలకృష్ణ నోరు జారిన సంగతి తెలిసిందే.
అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య వాఖ్యానించడం, అలా వాఖ్యలు సరికావని అక్కినేని మనవళ్లు చెప్పుకురావడం
నెటిజెన్స్ ఆగ్రహించడం అన్ని చకా చకా జరిగిపోయాయి. అక్కినేని అభిమానులు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తన వ్యాఖ్యలపై మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చాడు.
తాను ఫ్లోలో మాట్లాడిన మాటలే తప్ప అక్కినేని నాగేశ్వర్ రావు గారిని కించపరచలేదని చెప్పుకొచ్చాడు.
నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కండ్ల లాంటివారన్నాడు.
ఫ్లోలో వచ్చిన మాటలను తప్పుగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చాడు.
అంతటితో ఆగకుండా అక్కినేని నాగేశ్వర్‌రావు గారు తన పిల్లల కంటే ఎక్కువగా తనను ప్రేమించేవారని బాలకృష్ణ చెప్పుకురావడం మరో వివాదాన్ని తీసుకొచ్చింది. బాబాయి పై ప్రేమ తన గుండెల్లో ఉంటుందని
ఈ విషయంలో బయట ఏం జరిగినా తాను పట్టించుకోనని బాలకృష్ణ చెప్పాడు.