వీరసింహారెడ్డికి సింహా క్యారెక్టర్ గుర్తుకు వస్తోందట. అలాగే లెజెండ్ గా కూడా మారాలనిపిస్తోందట.
ఇదంతా ఎందుకు స్ట్రెయిట్ గా పాయింట్ కు రమ్మంటే మాత్రం
బోయపాటి దర్శకత్వంలో బాలయ్య మరోసారి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
సంక్రాంతికి వీర సింహారెడ్డి రిలీజ్ కు ఉంది.
ఆ తర్వాత అనిల్ రావిపూడితో మూవీ చేస్తున్నాడు.
ఇదే ఏడాది ఆదిత్య 369 సీక్వెల్ ప్రకటించనున్నాడు.
ఇప్పుడు బోయపాటితో కూడా ఓ మూవీ చేయనున్నాడట బాలయ్య.
వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు వచ్చాయి.
అఖండకు సీక్వెల్ తీయాలని బోయపాటికి ఉన్నా
ఇప్పుడు మరో పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ ప్లాన్ చేయాల్సిందిగా బాలయ్య అడుగుతున్నాడట.
పైగా ఈ మూవీని 14 రీల్స్ వారు నిర్మిస్తారట.
అందుకే రామ్ తో సినిమా ముగిసిన వెంటనే బోయపాటి
డైరెక్ట్ గా బాలయ్య తో తన కెరీర్ లో నాల్గవ చిత్రం చేయబోతున్నాడు.