నాని నటిస్తున్న న్యూ మూవీ దసరా. మార్చి 30న రిలీజ్ కానుంది.
అందుకు తగ్గట్లుగానే భారీ ఎత్తున ప్రమోషన్ నిర్వహిస్తున్నాడు నేచురల్ స్టార్.
అయితే ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఒదెల అలాగే నానికి మధ్య సినిమా ప్రారంభం అయినాటి నుంచి
కోల్డ్ వార్ జరగుతోందట. సినిమా స్టోరీని మార్చే విషయంలో వీరిద్దరికి గొడవ జరిగి షూటింగ్ కూడా ఆగిపోయిందట.
ఆ తర్వాత స్టోరీ మార్చి తెచ్చి నానిని ఇంప్రెస్ చేసాడట దర్శకుడు. ఇప్పుడు సినిమా మొత్తం పూర్తైన తర్వాత కూడా
మరికొన్ని సీన్స్ రీషూట్ చేయాలని దర్శకుడు శ్రీకాంత్ పట్టుబడుతుండటంతో నాని ఆగ్రహంగా ఉన్నాడట.
ఇప్పటి వరకు తీసింది సరిపోతుంది ఇక చాలు అంటున్నాడట. మొత్తంగా నాని, శ్రీకాంత్ ఫైట్,
ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మార్చి 30న సినిమా రిలీజైన తర్వాత ఫలితాన్ని బట్టి
ఈ రూమర్స్ లో ఎంత నిజం ఉందో తెలుస్తుంది. ఇప్పటికైతే ఈ ప్రాజెక్ట్ పై పాజిటివ్ వైబ్స్ మాత్రమే ఉన్నాయి.
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ కు ఆడియెన్స్ బాగానే ఇంప్రెస్ అయ్యారు.