తెలుగు నాట నెట్ ఫ్లిక్స్ సంచలనాలు సృష్టించాలని ఫిక్స్ అయింది.
2023లో రాబోయే పెద్ద చిత్రాలన్నిటిని కొనుగోలు చేసేసింది.
అందుకోసం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించింది.
నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన లిస్ట్ లో మహేష్, త్రివిక్రమ్ ఫిల్మ్ కూడా ఉంది.
పూర్తి వివరాల్లోకి వెళితే 2023 స్టార్టింగ్ నుంచి నెక్ట్ ఫ్లిక్స్ మంచి జోరు మీదుంది.
ఇప్పటికే రీసెంట్ బ్లాక్ బస్టర్స్ ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాల
స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది నెట్ ఫ్లిక్స్.
ఇప్పుడు ఈ ఏడాది రాబోయే ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్స్ లో కొన్నిటిని కొనుగోలు చేసింది.
ఆ లిస్ట్ లో విరూపాక్ష, వైష్ణవ్ తేజ్ నటిస్తున్న చిత్రం అలాగే వరుణ్ తేజ్ న్యూ మూవీ, టిల్లు స్క్వేర్, అనుష్క సినిమా,
మెగాస్టార్ న్యూ మూవీ భోళాశంకర్, అమిగోస్, మీటర్, బడ్డి, నాగశౌర్య మూవీ,బుట్టబొమ్మ లాంటి చిత్రాలు ఉన్నాయి.
నెట్ ఫ్లిక్స్ చూస్తుంటే మెగా హీరోలకు సంబంధించిన చిత్రాల కొనుగోలు పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.
కరోనా తర్వాత తెలుగు మార్కెట్ బాగా విస్తరించడం, ఇండియా అంతటా తెలుగు చిత్రాలు చూస్తుండటంతో
నెట్ ఫ్లిక్స్ కూడా ట్రెండ్ ను ఫాలో కావాలని ఫిక్స్ అయినట్లుంది. అందుకే టాలీవుడ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ
అత్యధికంగా తెలుగు చిత్రాలను కొనుగోలు చేసింది.