త్రిబుల్ ఆర్ రిలీజ్ కు ముందు నుంచి ఎన్టీఆర్ ఇంటికే పరిమితం అవుతూ వచ్చాడు.
నెలల తరబడి కొత్త సినిమా కోసం వేచి చూస్తూ వచ్చాడు. అభిమానులు ఒత్తిడి పెట్టినా భరించాడు.
వారికి ది బెస్ట్ మూవీ అందించాలనే ఆలోచనతోనే నెలల కొద్ది సినిమా షూటింగ్స్ కు దూరంగా ఉన్నాడు.
ఎట్టకేలకు కొరటాల సిద్ధం చేసిన కథ తారక్ కు బాగా నచ్చింది.
అందుకే ఇప్పుడు సినిమాను మార్చి 18న ఘనంగా ప్రారంభించబోతున్నాడట.
అందుకు సంబంధించిన వేదిక ఇంకా ఖరారు కాలేదు. మార్చి 12న ఆస్కార్ కార్యక్రమం ముగిసిన వెంటనే
ఇండియాకు తిరుగు పయానం కానున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత కొత్త సినిమాను ఘనంగా ప్రారంభిస్తాడు.
ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని పెద్దలు అంతా రానున్నారట. మార్చి 30న రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
హైదరాబాద్ శివార్లలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరణ జరగనుంది.
ఈ మూవీతో జాన్వీ కపూర్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే.
సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నాడు.