త్రిబుల్ ఆర్ మూవీలో చరణ్ తో కలసి నటించాడు తారక్. ఈ చిత్రం ఆస్కార్ వరకు వెళ్లింది. ఇప్పుడు అలాంటి ప్రాజెక్ట్ మరొకటి చేయాలనుకుంటున్నాడు. అందుకోసం పర్ఫెక్ట్ డైరెక్టర్ ను ఎంపిక చేసుకున్నాడు. అతనే వెట్రీమారన్. కోలీవుడ్ కు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన దర్శకుడు ఇతను. అలాంటి దర్శకుడు ఇప్పుడు తెలుగు హీరో పని చేయాలనుకుంటున్నాడు. అతనే జూనియర్ ఎన్టీఆర్. పైగా ఈ సినిమాలో ధనుష్ కూడా నటించనున్నాడట. వీరిద్దరి కాంబినేషన్ లో మల్టీస్టారర్ మూవీ అంటే అంచనాలు ఎలా ఉంటాయో తెల్సిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఎవరికి లాభం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వెట్రీ మారన్ తెలుగు మార్కెట్ లక్ష్యంగా ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తున్నప్పటికీ తారక్ కూడా కోలీవుడ్ పై పట్టుసాధించేందుకు వెట్రీమారన్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.ఏది ఏమైనా పర్ఫెక్ట్ డైరెక్టర్ తెరకెక్కించే చిత్రంలోకి ఇండియాలోనే ఇద్దరు అత్యుత్తమ నటులు రంగప్రవేశం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. 2025 తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోపు వెట్రీమారన్ సూర్య తో తెరకెక్కించాల్సిన సినిమా పూర్తి చేయాల్సి ఉంటుంది. తారక్ తన చేతిలో ఉన్న కొరటాల ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేయాలి.
రామ్ చరణ్ కోసం వస్తున్న ప్రభుదేవా త్వరలో శంకర్ స్టైల్ సాంగ్ షూటింగ్ ఆస్కార్ సంబరం ముగిసిన వెంటనే షూటింగ్. ప్రస్తుతం ఆస్కార్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు చరణ్. మార్చి 13తో ఆస్కార్ హంగామా కంప్లీట్ అవుతుంది.
ఆస్కార్ వేదికపై చరణ్ నాటు నాటు స్టెప్పులేయనున్నాడు. ఆ తర్వాత అదృష్టం ఉంటే ఆస్కార్ అందుకుని
ఇండియాకు వస్తాడు. ఆ వెంటనే కొంత కూడా గ్యాప్ లేకుండా శంకర్ మేకింగ్ లో కొత్త చిత్రం కొత్త షెడ్యూల్ ను ప్రారంభిస్తాడు. మార్చి 17 నుంచి హైదరాబాద్ లో వేసిన కొత్త సెట్ లో పాట చిత్రీకరణ ఉండనుంది. అందుకోసం కియారా అద్వానీ కూడా రానుంది. పెళ్లి తర్వాత సినిమాలకు లీవ్ పర్మిషన్ తీసుకుని ఇంటికే పరిమితం అయింది కియారా. ఇప్పుడు చరణ్ చిత్రం కోసం షూటింగ్ సెట్ లోకి అడుగు పెట్టనుంది. వీరిద్దరిపై ప్రభుదేవా స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించబోతున్నాడు. కోట్లు రూపాయలు పెట్టి వేసిన సెట్ లో ప్రభుదేవా కంపోజ్ చేసే డ్యాన్స్ స్టెప్స్ హైలైట్ గా నిలవబోతున్నాయి. సాంగ్ షూటింగ్ పూర్తైన తర్వాత ఏప్రిల్లో మరో న్యూ షెడ్యూల్ ప్రారంభించనున్నాడు శంకర్.