షారుక్, దీపికా పడుకోణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం పఠాన్.
ప్రస్తుతం ఈ మూవీ చుట్టూ వివాదాలు చుట్టు ముడుతున్నాయి.
పఠాన్ నుంచి ఇటీవల రిలీజైన బేషరమ్ రంగ్ సాంగ్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
ఈ పాటలో దీపికా ధరించిన క్యాస్ట్యూమ్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
గ్లామర్ డోస్ కూడా మించిందని ,
పఠాన్ మూవీని బ్యాన్ చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ఊపందుకుంది.
మధ్యప్రదేశ్ కు చెందిన మంత్రి ఒకరు మూవీని బ్యాన్ చేయాలని అంటున్నాడు.
సాంగ్ లో కాషాయ దుస్తులను వాడటం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
సినిమాలో కొన్ని అభ్యంతరకర సీన్లు ఉన్నాయని,
ఈ సన్నివేశాలు తొలగించని పక్షంలో మధ్యప్రదేశ్ లో పఠాన్ మూవీని బ్యాన్ చేస్తామని హెచ్చరిస్తున్నాడు .
బేషరమ్ పాటలో కాస్ట్యూమ్స్ తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, ఈ సాంగ్‌ను కూడా చీప్ మైండ్‌సెట్‌తో షూట్ చేసారని సదరు మంత్రి ట్వీట్ కూడా చేశారు. వచ్చే ఏడాది జనవరి 25న పఠాన్ మూవీ పాన్ ఇండియావైడ్ గా రిలీజ్ కానుంది.
రిలీజ్ నాటికి ఈ మూవీ ఇంకెన్ని వివాదాలకు కేంద్రబింధువుగా మారుతుందో చూడాల్సి ఉంది.