2017లో రిలీజైన ఇండియన్ బ్లాక్ బస్టర్ బాహుబలి -2 రికార్డులను తెలుగు సినిమా ఎప్పుడో అధిగమించేసింది.
గత ఏడాది రిలీజైన త్రిబుల్ ఆర్, బాహుబలి 2 వసూళ్లను బద్దలు కొట్టింది. ఇక పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కలెక్షన్స్ మాత్రం ఇంకా బాహుబలి పేరుతోనే ఉన్నాయి. ఈ దశలో హిందీ సినిమాకు బాహుబలి 2 వసూళ్లను అధిగమించేందుకు
ఇంత కాలం పట్టింది. అది కూడా షారుఖ్ వల్లే సాధ్యపడింది. పఠాన్ రిలీజ్ కు ముందు షారుఖ్ కనీసం వంద కోట్లు కొట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి హీరో పఠాన్ తో రెచ్చిపోయాడు. ఒకప్పుడు తనని కలెక్షన్స్ కింగ్ అని ఎందుకు పిలిచేవారో మరోసారి నిరూపించాడు. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 800 కోట్ల వసూళ్లను దాటింది. అదే స్పీడ్ లో బాహుబలి 2 హిందీ గ్రాస్ 802 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసింది. దాంతో బాలీవుడ్ రికార్డులన్ని ఇప్పుడు బాలీవుడ్ హీరోల పేరుతోనే తిరిగి అందుకున్నట్లు అయింది. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా కీలకంగా భావించే డేవన్ కలెక్షన్స్, ఓవరాల్ కలెక్షన్స్ లో ఇప్పుడు పఠాన్ మూవీ ముందు వరుసలో నిలిచింది. మొన్నటి వరకు తొలి రోజు వసూళ్ల రికార్డ్ కేజీయఫ్ 2 పై ఉండేది అలాగే ఓవరాల్ కలెక్షన్స్ రికార్డ్ బాహుబలి 2 పేరుతో ఉండేది. ఈ రెండు రికార్డులను పటాన్ బద్దలు కొట్టి
మళ్లీ బాలీవుడ్ ను కాలర్ ఎగిరేసుకునేలా చేసాడు. ప్రస్తుతం పఠాన్ వెయ్యి కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతున్నాడు.
అల్టిమేట్ గా ఎంతకు సెటిల్ అవుతాడు అనేది ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు.