పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ తో జరుగుతోంది.
ఈ సినిమా కోసం కేవలం 30 నుంచి 40 కాల్ షీట్స్ మాత్రమే అందించాడు పవన్.
అందుకోసం దాదాపు 60 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు.
అయితే ఈ 40 రోజుల్లోనే పవన్ తో టాకీ పార్ట్ కంప్లీట్ చేయడం మాత్రమే కాకుండా
ఒక స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు సముద్రఖని.
ఆ స్టోరీ ఇది వరకే తెలుసు అంటారా. అయితే లేటెస్ట్ గా ఈ మూవీలో శ్రీలీల కనిపిస్తుందనే విషయం తెలుసా
పవన్, తేజ్ పై చిత్రీకరించే పాటలో శ్రీలీల కూడా స్టెప్పులేయనుందట.
పైగా సాంగ్ గతంలో బాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ బంటీ ఔర్ బబ్లీ రేంజ్ లో
ఉంటుందట. అంటే శ్రీలీల ఇప్పుడు ఐశ్వర్యారాయ్ రేంజ్ లో స్టెప్పులేయనుందని సమాచారం.
పెళ్లి సందడి, ధమాకా సినిమాల్లో శ్రీలీల డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది.
అందుకే మహేష్ మూవీలోనూ ఆమెకు సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్.
ఇప్పుడు పవన్ మూవీలో సైతం స్పెషల్ సాంగ్ ఇస్తున్నాడు.
వచ్చే ఆగస్ట్ లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు సమాచారం.
అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ మూవీ కూడా ఆగస్ట్ లోనే రిలీజ్ ఉంది.
ఒకేసారి తన దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం తన నిర్మాణంలోతెరకెక్కే చిత్రాన్ని త్రివిక్రమ్ రిలీజ్ చేసే అవకాశాలు అయితే లేవు. మరి పవన్ న్యూ మూవీ ఆగస్ట్ రిలీజ్ అనే రూమర్ ఎలా పుట్టుకొచ్చిందో అర్ధం కాకుండా ఉంది.