పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా హరి హర వీర మల్లు. వచ్చే ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ చాలా సీరియస్ గా ఉన్నాడు. డైరెక్టర్ క్రిష్ అద్బుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో నటించబోయే నటీనటుల లిస్ట్ అంతకంతకూ పెరుగుతోంది. మొన్నే బాలీవుడ్ నుంచి కండల వీరుడు బాబిడియోల్ వచ్చాడు. ఇప్పుడు దిల్ బర్ సాంగ్ తో కుర్రకారు డ్రీమ్ గర్ల్ గా మారిన కెనెడియన్ నూర ఫతేహీ కూడా కనిపించబోతోందట. ఆమె ఈ చిత్రంలో మొఘుల్ యువరాణి పాత్రను పోషించనుందట. పవన్ కు నూరాకు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయట. మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో ఒక వజ్రం దొంగతనం నేపథ్యంలో సన్నివేశాలు ఉండటంతో నిర్మాత ఏ.ఎం.రత్నం నిజంగానే 40 లక్షలు వెచ్చించి ఒక వజ్రం కొనుగోలు చేసారట. రియాలిటీకి దగ్గరిగా ఉండాలనే ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నడు ఏ.ఎం.రత్నం.ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాతే వారాహి ఎక్కి ప్రజల్లోకి వెళ్లాలని పవన్ డిసైడ్ అయ్యాడని సమాచారం.