ఆర్ ఎక్స్ 100 తో పాయల్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.
ఇప్పటికీ ఈ సినిమా పేరు చెబితే పాయల్ పేరు ఠక్కున చెప్పేస్తారు ఆమె ఫ్యాన్స్.
అంతగా పాపులర్ అయింది ఈ బ్యూటీ. తొలి సినిమాతో సూపర్ క్రేజ్ వచ్చినప్పటికీ
ఆ తర్వాత స్టార్ డమ్ అందుకోలేకపోయింది. దాంతో వచ్చిన అవకాశాల్లో నటిస్తూ ముందుకెళ్తోంది.
అయితే తన సోషల్ మీడియా వాల్ పై ప్రియుడు సౌరభ్ కు బర్త్ డే విశెష్ తెలియజేస్తూ
అతనిపై బోల్డంత ప్రేమను ఒలకబోస్తూ రాసుకొచ్చిన పోస్ట్ ఇప్పుడు వైరల్అవుతోంది.
పైగా పోస్ట్ తో పాటు పెట్టిన ఫోటోలు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
దాంతో త్వరలోనే పాయల్ కూడా పెళ్లి పీటలెక్కనుందని బాగా ప్రచారం సాగుతోంది.
అయితే పాయల్, సౌరభ్ చిన్న నాటి స్నేహితులు కొంత కాలం కలసే నటించారు.
ఈ దశలో ఇప్పుడు పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు నెటిజన్స్.
అయితే పాయల్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.